తనకి దక్కిన అద్భుత అవకాశాన్ని రాజ్ తరుణ్ వినియోగించుకుంటాడా?

Saturday, January 13th, 2018, 04:35:24 PM IST

అవును యంగ్ క్రేజీ హీరో రాజ్ తరుణ్ నిజంగానే ఒక అద్భుత అవకాశం దక్కింది. సంక్రాంతి పండుగ అనగానే మన టాలీవుడ్ లో సినిమాల కోలాహలం మొదలవుతుంది. ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కూడా రెండు బడా హీరోల చిత్రాలు, ఒక డబ్బింగ్ చిత్రం విడుదలయ్యాయి. వీటిమధ్యలో విడుదల అవుతున్న చిన్న చిత్రం ‘రంగుల రాట్నం’. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి డివైడ్ టాక్ ను, బాలయ్య నటించిన జయసింహ కూడా బీలో యావజీ టాక్ ను, ఇక తమిళ నటుడు సూర్య నటించిన గ్యాంగ్ కూడా యావరేజ్ టాక్ సంపాదించాయని, ఇక మిగిలింది రాజ్ తరుణ్ చిత్రమే. కనుక ఒకవేళ ఇది కనుక మంచి చిత్రంగా టాక్ సంపాదిస్తే కలెక్షన్ లు చాలావరకు కుమ్మేయొచ్చని అంటున్నారు.

ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద చిత్రాలతో పాటు విడుదలయి విజయవంతం అయిన కొన్ని చిన్న చిత్రాలు కూడా వున్నాయి, శతమానంభవతి, ఎక్సప్రెస్ రాజా చిత్రాలు ఈ సీజన్లో విడుదలయి మంచి విజయవంతం అయ్యాయి. అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వస్తున్న ఈ రంగుల రత్నం కూడా ఫామిలీ ఎంటర్టైన్మెంట్, అండ్ యూత్ ఫుల్ చిత్రంఅని, తెలుగు ప్రేక్షకులు మంచి కథ, కథనం వున్న ఇటువంటి ఫామిలీ ఎమోషనల్ చిత్రాల్ని ఆదరిస్తారనే నమ్మకంతోనే అన్నపూర్ణ వారు ఈ సంక్రాంతికి విడుదల చేయాలి అని నిర్ణయించారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్ తరుణ్ కి ఇది అద్భుత అవకాశం అని, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం వుంది. మరి ఈ చిత్రం ఏమేరకు ఘానా విజయం సాధిస్తుందో వేచి చూడాలి…