బిగ్ న్యూస్ : ఇక రాపాక తీరు మారదా..?

Saturday, July 11th, 2020, 10:53:26 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో ఏదో చేస్తుందనుకున్న పార్టీ ఇంకేదో చూడాల్సి వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ పోటీ చేసిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకోవడం ఆ పార్టీకు పెద్ద షాక్ ఇచ్చింది.

సరే ఒక్క ఎమ్మెల్యే అయినా గెలిచాడు జనసేన అడుగు అక్కడే మొదలయ్యింది అనుకుంటే అతను కూడా ఇప్పుడు పార్టీకు పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు.రాజోలు నియోజకవర్గ వర్గం నుంచి గెలుపొందిన రాపాక వర ప్రసాద్ జనసేన పార్టీ విధి విధానాలకు పూర్తి వ్యతిరేకంగా నడుచుకొంటూ అధికార వైసీపీ పార్టీకు వత్తాసు పలుకుతున్నారు.

కానీ ఆ పార్టీలో ట్రీట్మెంట్ ఏమన్నా బాగుందా అంటే అదీ లేదు. మరీ ఘోరంగా ఉంది. ఆ పార్టీ కార్యకలాపాల్లో రాపాక కనిపిస్తున్నాడు కానీ ఆ పార్టీ లో కనీస విలువ కూడా ఇవ్వట్లేదు. అయినప్పటికీ రాపాక మాత్రం తన తీరు మార్చుకునే సంకేతాలు అయితే కనిపించడం లేదు. మరి ఇకనైనా రాపాక తీరు మారుతుందో లేదో చూడాలి.