థమన్ హ్యాట్రిక్ కొడతాడా?

Thursday, February 1st, 2018, 09:46:10 AM IST

ఎస్ ఎస్ థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లోని అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ దగ్గర శిష్యరికం చేసిన థమన్ తర్వాత సంగీత దర్శకుడిగా మారి అనతి కాలం లోనే మంచి పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు థమన్ కి నేటి థమన్ కి చాలా వ్యత్యాసం ఉందని సంగీత ప్రియులు అంటున్నారు. ఒకప్పుడు ఆయన చిత్రాల్లోని సంగీతం రిపీటెడ్ గా ఒకే విధమయిన వాయిద్యాల హోరు ఎక్కువగా వుంటుందనే విమర్శ వుంది. కానీ ప్రస్తుతం థమన్ మ్యూజిక్ స్టైల్ లో చాలా చేంజ్ వచ్చిందని అంటున్నారు. ఈ మధ్య రిలీజ్ అయి మంచి ఘన విజయం సాధించిన శర్వానంద్ మహానుభావుడు కి థమన్ ఇచ్చిన సంగీతం నిజంగా అద్భుతమని అంటున్నారు. నిజానికి అందులో మెలోడీలు మంచి పేరు సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన సంగీతం అందించిన మూడు చిత్రాలు ఒక రోజు అటుఇటుగా విడుదల కానున్నాయి. అందులో మోహన్ బాబు గాయత్రి, వరుణ్ తేజ్ తొలిప్రేమ, సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్. ఇందులో తొలిప్రేమలో ట్రెండి సాంగ్స్, ఇంటెలిజెంట్ లో మాస్ అండ్ స్టైలిష్ సాంగ్స్, గాయత్రి లో మంచి మెలోడీస్ ఉన్నాయని తెలుస్తోంది. ఈమధ్య విడుదలై మంచి విజయం దిశగా దూసుకుపోతున్న భాగమతికి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద అస్సెట్ అంటున్నరు. ఇక ఇప్పుడు ఆయన స్వరపరచిన మూడు చిత్రాల పై కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఇందులో ఏవి హిట్ అవుతాయో, ఏవి ఫట్ అవుతాయ, లేక మూడు చిత్రాలు విజయవంతం అవుతాయో ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది, అదే కనుక మూడు చిత్రాలు మంచి విజయం సాధిస్తే థమన్ హ్యాట్రిక్ కొట్టినట్లే అని సినీ వర్గాలు అంటున్నాయి….