రివ‌ర్స్ స్కీమ్‌: న‌ల్ల కుబేరులు బెంబేలు.. 2000 నోట్లు అమ్మ‌కానికి..!

Wednesday, December 28th, 2016, 04:57:35 PM IST

money
500, 1000 నోట్ల ర‌ద్దుతో బెంబేలెత్తిన న‌ల్ల కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న పెద్ద నోట్ల‌ను వ‌దిలించుకోవడానికి 100 నోట్లు, కొత్త నోట్ల మార్పిడికి పెద్ద ఎత్తున పాల్ప‌డ్డారు. 15 శాతం క‌మీష‌న్ ఇచ్చి మ‌రీ పెద్ద నోట్లు మార్చుకున్నారు. అయితే ఇప్పుడు న‌ల్ల డ‌బ్బు అంతా కొత్త 2000 నోట్ల‌లోకి మారిపోయింద‌ని భావిస్తున్న మోదీ త్వ‌ర‌లోనే 2000 నోట్ల‌ను ర‌ద్దు చేసే యోచ‌న చేస్తున్నారు. అంతేకాదు న‌ల్ల డ‌బ్బు దొర‌ల‌కు మ‌రో ఛాన్స్ నిస్తూ 50-50 ప్రాతిప‌దిక‌ను పెద్ద నోట్ల‌ను అఫీషియ‌ల్‌గా మార్చుకోవ‌చ్చ‌ని చెప్పారు. దీంతో ఇదివ‌ర‌కే 15శాతం క‌మీష‌న్‌కి పాత పెద్ద నోట్లు అమ్ముకున్న‌వాళ్లంతా తిరిగి మ‌రో 10 శాతం క‌మీష‌న్ ఇచ్చి పాత పెద్ద నోట్ల‌ను తిరిగి కొనుక్కుంటున్నారు.

అంటే ఇప్ప‌టికే పెద్ద నోట్ల‌పై 25 శాతం న‌ష్ట‌పోగా, వాటిని బ్యాంకుల‌కు ఇచ్చి మ‌రో 50శాతం న‌ష్ట‌పోయేందుకు రెడీ అవుతున్నార‌న్న‌మాట‌! అంటే మొత్తం 75 శాతం న‌ష్టాల‌కు పాత పెద్ద నోట్లు ఇచ్చేయ‌బోతున్నారు. అస‌లు మొత్తం న‌ష్ట‌పోయే కంటే క‌నీసం ఆ 25 పైస‌లు అయినా మిగుల్చుకోవాల‌ని త‌ప‌న‌. పైగా పెద్ద ఎత్తున 2000 నోట్ల క‌ట్ట‌లు ఉన్న క‌ట్ల పాములు ఐటీకి అడ్డంగా దొరికిపోతున్నాయ్‌. మునుముందు భారీ జ‌రిమానాల‌తో అంతు చూసేందుకు ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాలు రూపొందించే ప‌నిలో ఉంది. 2000 నోట్లు ర‌ద్దు చేసి, కొత్త బినామీ చ‌ట్టం తెచ్చి న‌ల్ల దొర‌ల అంతు చూడ‌డ‌మే ల‌క్ష్యంగా ప్లానింగులో ఉంది. ఈ రివ‌ర్స్ స్కీమ్ వ‌ల్ల న‌ల్ల కుబేరులంతా బెంబేలెత్తిపోతున్నారు. దాంతో తిరిగి ఇలా 2000 నోట్లు క‌మీష‌న్ల‌కు అమ్మేస్తున్నారు. తిరిగి పాత నోట్లు తీసుకుని వైట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. దేవుడ‌!!

  •  
  •  
  •  
  •  

Comments