సాయి ధరం తేజ మార్కెట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

Sunday, February 26th, 2017, 11:28:52 AM IST


విన్నర్ సినిమాకి టాక్ కాస్త యావరేజ్ గానే ఉంది .. కమర్షియల్ ఫార్మాట్ కి కేరాఫ్ అయిన గోపీ చంద్ మలినేని కాన్సెప్ట్ లు అన్నీ అలాగే ఉంటాయి కూడా. కానీ విన్నర్ మొదటి రోజు వసూళ్లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దుము దులిపెసాయి అనే చెప్పాలి. సాయి ధరం తేజ కెరీర్ లోనే అతిపెద్ద ఫిస్ట్ డే గ్రాసర్ గా నిలిచింది విన్నర్ చిత్రం. సుప్రీం మొదటి రోజు కలక్షన్ లు విన్నర్ ని తేలికగా దాటేసాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదున్నర కోట్ల షేర్ ని రాబట్టి షాక్ ఇచ్చాడు సాయి ధరం తేజ. అతని రేంజ్ కి ఇది చాలా ఎక్కువ మరి. అతడి కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద హిట్టుగా ఉన్న ‘సుప్రీమ్’ తొలి రోజు మూడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టింది. ‘విన్నర్’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ షేర్ రూ.7 కోట్లకు చేరువగా ఉంటుందని భావిస్తున్నారు.మహాశివరాత్రి సెలవు రోజు కావడంతో తొలి రోజు వసూళ్ల మోత మోగింది. ఓవరాల్ గా టాక్ కొంచెం డివైడ్ గా ఉన్నప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. బి-సి సెంటర్లలో సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది.