ట్రైలర్ టాక్ – రొటీన్ మసాలా మాస్

Sunday, February 12th, 2017, 12:27:56 PM IST


అదే తరహా పంథా ఫార్మాట్ లో వచ్చే సినిమాలకి మనదగ్గర కొదవే లేదు. ఒకే మూస కథ దానికి కాస్తంత హీరో బిల్డప్ షరా మామూలు కామెడీ సీరియస్ విలన్ ఇలాంటి సినిమాలు ఎన్నో చూసేసాం. మళ్ళీ మనకి అలాంటి కథనే పట్టుకొచ్చాడు గోపీ చంద్ మలినేని. సాయి ధరం తేజ హీరోగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందరకి వచ్చేస్తోంది. డాన్ శీను.. పండగ చేస్కో.. వంటి సినిమాలను తీసిన గోపిచంద్ మలినేని డైరక్షన్లో.. ”విన్నర్” సినిమా రూపొందింది. ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా సాయి ధరమ్ తేజ్.. అలాగే ఒక అథ్లెట్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ మెగా మేనల్లుడు కావల్సినన్ని పంచ్ డైలాగులు వదులుతుంటే.. తన అందాలతో అతడికి బౌన్సర్లు ఇస్తోంది రకుల్. ఇకపోతే విలన్ గా జగపతి బాబు నటించాడు. అసలు సినిమా కథలో ఖాళీగా ఉన్న ల్యాండ్ లో గుర్రపు పంథాలు పెట్టడం అనే అంశం ఏదైతే ఉందో.. అది కొత్తగానే ఉందిలే. ఇకపోతే ఓవరాల్ గా థమన్ పాటలు.. వెలిగొండ శ్రీనివాస్ పంచ్ డైలాగులూ.. రకుల్ అందాలు.. పాటల విజువల్స్.. కలర్ ఫుల్ లుక్స్.. అదిరాయ్. రొటీన్ మసాలాయే కాని.. కామెడీ క్లిక్ అయితే.. యాక్షన్ సక్సెస్ అయితే.. సినిమా హిట్టయ్యే ఛాన్సుంటుంది.