ఆ ఒక్క నిర్ణయం వల్ల “తుగ్లక్” అనిపించుకుంటున్న జగన్.!

Thursday, August 22nd, 2019, 11:23:37 AM IST

వైసీపీ అభిమానులు మరియు ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ చిరకాల కోరిక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం.ఎలాగో జగన్ అధికారంలోకి వచ్చేసారు.రావడంతోనే వారలా జల్లులు కురిపించి ప్రజల మన్ననలు అందుకున్నారు.కానీ మాటలతో కట్టిన మేడలను నిజం చేసే ప్రక్రియలో మాత్రం కుప్పకూలిపోయారు.అంతేకాకుండా తాను తీసుకుంటున్నవంటి నిర్ణయాలు అసలు అర్ధం కావట్లేదని జగన్ పరిపాలన శుద్ధ దండగ అన్న రేంజ్ లో ఇతర పార్టీల శ్రేణులు జగన్ ను ఏకి పారేస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది జగన్ పాలనను చూసి తుగ్లక్ పాలనను మించిపోయేలా ఉందని సెటైర్లు వేస్తున్నారు.ఇప్పుడు ఆ మాటలను నిజం చేసే విధంగా జగన్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందని విపక్షాల నేతలు అంటున్నారు.రాజధానిని మార్చే ఆలోచనలో వై ఎస్ జగన్ ఉన్నారన్న వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి అందరికి తెలిసిందే.దీనిపై ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజధానిని మార్చడం అనేది నిజంగా చాలా తెలివితక్కువ నిర్ణయం అని అంటున్నారు.సిపిఐ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ తుగ్లక్ పాలన అయినా సరే కొంతమంది బాగుంది కొంతమంది బాగోలేదు అని అన్నారు కాం జగన్ పాలన మాత్రం ఎలా ఉందో ఎవరు చెప్పలేకపోతున్నారని ఒకవేళ జగన్ నిజంగా రాజధానిని తరిలించినట్టయితే ఇక తుగ్లక్ పాలన వచ్చేసినట్టే అని సంచలన కామెంట్స్ చేసారు.