విద్యుత్ తోనే ప్రగతి సాధ్యం

Tuesday, September 16th, 2014, 03:56:46 PM IST


విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేననిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు ఆయన కేంద్ర విధ్యుత్ శాఖమంత్రి పియూష్ గోయల్ తో సమావేశం అయ్యారు. ఏ రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా.. విద్యుత్ ఎంతో అవసరమని.. తాము అధికారంలోకి వచ్చినపుడు రాష్ట్రంలో 22 మిలియన్ యూనిట్ల నష్టంలో ఉన్నదని.. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడమే కాకుండా.. నిరంతర విద్యుత్ కోసం కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలో మొదటిసారి.. 2500మెగావాట్ల సోలార్ పవర్ స్టేషన్ ను నెలకొల్పేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని.. కరువుప్రాంతమైన రాయలసీమలో ఈ ప్లాంట్ ను నెలకొల్పుతామని చంద్రమాబు తెలిపారు. విశాఖలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్టు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.