అగ్రిమెంటు అయ్యాకే ఎన్‌ఆర్‌ఐ వివాహం చెల్లుతుంది..

Saturday, March 3rd, 2018, 01:21:02 PM IST

ఎన్‌ఆర్‌ఐ వివాహాలు చేస్కునే ఆడపడుచులకు రక్షణ కల్పించేందుకు చట్టబద్ధత దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త పతాకాన్ని అమలు చేసేందుకు యోచిస్తోంది. అయితే పెళ్ళికి ముందు వధూవరుల కటుంబీకులు చేస్కునే ఒప్పందాలు చట్టబద్దం చేయాలి అని, స్త్రీలకూ ఎన్‌ఆర్‌ఐ అని పెళ్లి చేస్కొని మోసం చేసేవారికి భయం, క్రమశిక్షణ కల్పించాలని ఆలోచనలో ఉంది. స్త్రీ-పురుష సమానత్వాన్ని పెంపొందించే కృషిలో భాగంగా మోదీ ప్రభుత్వం ఈమేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు గాను మార్చి నెలాఖరులో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ దిల్లీలో ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. హోం, న్యాయ శాఖలతో పాటు, మహిళా జాతీయ కమిషన్‌ ప్రతినిధులు, న్యాయ నిపుణులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. వివాహానికి ముందు ఒప్పందాలు చేసుకునే విధానం కొన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉంది కాబట్టి ఆయా దేశాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగడం లేదని అలలంటి పథకాన్ని భారతదేశంలో కుడా అమలు చేయాలని, పెళ్లికి ముందే సంబంధిత జంట కావాల్సిన పత్రాలపై సంతకాలు చేయాలని, వివాహానంతరం వేరుపడే పరిస్థితి వస్తే – ఉమ్మడి ఆస్తులను ఎలా పంచుకోవాలి? నియమ నిబంధనలు ఎలా ఉండాలి? వంటివి ఆ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొంటారు. అయితే ఈ పాశ్చాత్య విధానాలను ఉన్నవిఉన్నట్లుగా కాకుండా.. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఓ విధానం రూపొందించే విషయమై సమావేశంలో చర్చించనున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ప్రవాస భారతీయులను (ఎన్‌ఆర్‌ఐ) పెళ్లి చేసుకునే మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, వారి ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపాయి.

అయితే ఈ విషయంలో భారతీయ ఒప్పంద చట్టం-1872తో కీలక సవాల్‌ ఎదురు కానుంది. ఇందులోని 23, 26 సెక్షన్ల ప్రకారం ఇలాంటి ఒప్పందాలు చెల్లనేరవు. దేశంలోని ఏ వివాహ చట్టం కూడా ఇలా పెళ్లికి ముందు ఒప్పందాలను అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల సవరణపై కూడా సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో వివాహాలన్నీ దాదాపుగా సంప్రదాయ ఒప్పందాలతోనే జరుగుతుంటాయి. ఈమేరకు మహిళల హక్కులను పరిరక్షించేలా.. వివాహ ముందస్తు ఒప్పందాలకు కొంత చట్టబద్ధత లభించేలా నిపుణులంతా కూలంకషంగా ఈ విషయంపై చర్చిస్తారు. ఒకసారి ఆస్తులు, చెల్లింపులు, బాధ్యతలపై చట్టబద్ధమైన ఒప్పందం కుదిరితే.. భార్యాభర్తలిద్దరూ విడిపోవాలన్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

  •  
  •  
  •  
  •  

Comments