పెళ్లై ముప్పై ఏళ్లు గడచినా ఆమె భర్త ఆ పని చేస్తున్నాడట !

Thursday, February 16th, 2017, 11:18:20 AM IST


పోర్న్ ఇండ‌స్ట్రీ.. ప్ర‌పంచాన్ని చాప చుట్టేసిన డేంజ‌ర‌స్ ఇండ‌స్ట్రీ ఇది. అశ్లీల వీడియోల మార్కెట్ కొన్ని ల‌క్ష‌ల కోట్లు అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యువ‌త‌ను చెడుదారిలోకి మ‌ళ్లిస్తున్న ఈ ప‌రిశ్ర‌మ‌పై పాశ్చాత్య‌దేశాల్లో ఎలాంటి క‌ట్ట‌డి లేదు. య‌థేచ్ఛ‌గా ఈ తంతు సాగిపోతూనే ఉంది. నిరంత‌రం కొన్ని వంద‌ల, వేల‌ మంది అమ్మాయిలు త‌మ శీలాల్ని ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌దే లేదు. అయితే ఈ మ‌హ‌మ్మారీ భార‌త‌దేశాన్ని ఓ రేంజులో ఒణికిస్తోంద‌న్న‌ది నిత్య‌స‌త్యం.

నిరంత‌రం భార‌త‌దేశం నుంచి, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి మ‌గువ‌లు మాయ‌మ‌వుతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. వేలాదిగా టీనేజ‌ర్ల‌ను, యువ‌తుల‌ను విదేశాలు త‌ర‌లించే మాఫియా ముఠాలు దేశంలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొన్ని నిజాలు గ‌గుర్పొడిచే రేంజులో ఉంటాయి. ఇంట్లోంచి బ‌య‌టికి వెళ్లిన బాలిక తిరిగిరాలేద‌ని పోలీస్ స్టేష‌న్ల‌లో న‌మోద‌య్యే కేసులెన్నో. త‌ల్లిదండ్రులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసినా త‌మ బిడ్డ తిరిగి రాదు. అలా జీవితాంతం ఎదురు చూసి క‌న్న‌వాళ్లు క‌డ‌తేరిపోతున్నారు త‌ప్ప త‌మ బిడ్డ ఆచూకి క‌నుక్కోలేక‌పోతున్నారు. ఇదంతా పోర్న్ ఇండ‌స్ట్రీ మ‌హిహ‌. అందుకే ఇండియాలో క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టాల్ని తేవాల‌ని ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లెన్నో వ‌చ్చాయి. అయితే ఆన్‌లైన్ క‌ట్టడి అన్న‌ది ప్ర‌భుత్వాల ప‌రిధిని దాటిపోతోంది. ఎవ‌రెంత అరిచినా ఏం లాభం? అస‌లు మ‌న దేశంలో పోర్న్ వెబ్‌సైట్ల‌ను క‌ట్ట‌డి చేసే స‌త్తానే క‌నిపించ‌డం లేదు. య‌థేచ్ఛ‌గా టీనేజ‌ర్ల పోర్న్ స‌హా అన్నిర‌కాల పోర్న్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. గ‌తంలో బాల‌ల అశ్లీల చిత్రాల వెబ్‌సైట్ల‌ను నిషేధిస్తూ కేంద్రం ఆదేశించినా ఇప్ప‌టికీ ఆ చ‌ట్టానికి అతీగ‌తీ లేనేలేదు. తాజాగా ఓ మహిళ మ‌రోసారి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది.తమకు పెళ్లై ముప్పై ఏళ్ళు గడిచిందని, ఈ వయసులో తన భర్త అశ్లీల వెబ్ సైట్లు చూస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. త‌న భ‌ర్త నిరంత‌రం పోర్న్‌వెబ్‌సైట్లు చూస్తూ త‌న‌ని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాడ‌ని, కాపురం కొల్లేరైపోయిందని వెంట‌నే అలాంటి వెబ్‌సైట్ల‌ను నిరోధించాల‌ని సుప్రీంలో పిటిష‌న్ వేసింది. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ జ‌రుపుతోంది.