భర్త లేకుండా పెళ్లి చేసుకున్న యువతి.. ఎందుకంటే ?

Thursday, September 28th, 2017, 05:17:30 PM IST

జీవితంలో ఏ అమ్మాయి అయినా సరే మంచి వ్యక్తితో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అలాగే పెళ్లి తర్వాత హనీమూన్ కి కూడా వెళ్లాలని కళలు కంటుంది. అయితే రీసెంట్ గా ఒక స్త్రీ చేసుకున్న వివాహం గురించి తెలిస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే. అసలు ఆ మహిళ చేసుకున్న వివాహం ఎవరితో అనుకుంటున్నారా ఈ ప్రపంచంలో తను ఉన్నంతవరకు తనతోనే ఉండే తనను వివాహం చేసుకుంది.

తనను తానే వివాహం చేసుకుంది. అలాగే హాని మూన్ కి కూడా వెళ్ళింది. వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన లారా మెసీ ఫిట్‌నెస్ శిక్ష‌కురాలిగా ప‌నిచేస్తోంది. ఆమెకి 12 ఏళ్ల క్రితమే ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. కానీ ఆ తర్వాత వివాదాలతో అతని నుండి విడిపోయి సపరేట్ గా ఉంటోంది. అయితే ఒంటరి జీవితం గడపలేక మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఆమెకు సరైన వాడు దొరకేలేడు. కరెక్ట్ గా తన వయసు 40కి వచ్చేసరికి ఎవ్వరు నచ్చకుంటే తనను థానే వివాహం చేసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకుంది. దీంతో రీసెంట్ గా 40 దాటడంతో అన్నట్టుగానే స్నేహితులను బంధువులను పిలిచి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. `సోలోగ‌మీ` అనే ఈ స్వయం వివాహం గత కొన్నేళ్లుగా చాలా మంది చేసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments