విమానం ఇంజన్ లో కాయిన్ వేసిన బామ్మ.. ఎందుకంటే ?

Saturday, October 21st, 2017, 10:02:03 PM IST

ప్రపంచ దేశాలు ఆధునిక యుగంలో ఎంత ముందుకు వెళుతున్నాయి. కానీ కొన్ని దేశాల్లోని ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలతో కొనసాగుతున్నారు. నమ్మకాలు ఉంటే పరవాలేదు. కానీ వారు ఆ నమ్మకంతో చేసే కొన్ని పనులు ఇతరులకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. అంతే కాకుండా ప్రాణభయానికి కూడా గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వయసు పై బడిన వారు ఆ విధంగా చేయడంతో అందరు షాక్ కి గురవుతున్నారు.

రీసెంట్ గా విమాన ప్రయాణ చేయడానికి రెడీగా ఉన్న ఒక వృద్ధురాలు చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే.. చైనాలోని అన్హూయీ ప్రాంతంలో ఓ బామ్మ ల‌క్కీ ఎయిర్ జెట్‌కు చెందిన‌ విమానం ఎక్కుతూ.. విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేసింది. అది చుసిన తోటి ప్రయాణికులు వెంటనే సిబ్బందికి తెలియజేయడంతో విమాన సిబ్బంది ఆ వృద్ధురాలు వేసిన కాయిన్స్ ని గుర్తించారు. వెంట‌నే స్పందించిన ట్రాన్స్ పోర్ట్ పోలీసులు ఆ బామ్మ‌ను అదుపులోకి తీసుకున్నారు. అలా చేస్తే ప్రయాణం ప్రమాదం లేకుండా కొనసాగుతుందనే నమ్మకంతో తాను ఇంజన్ లో కాయిన్స్ వేశానని ఆ వృద్ధు రాలు తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments