కరోనా ఎఫెక్ట్ : భర్త కోసం క్వారంటైన్ నుండి పారిపోయిన మహిళా…?

Monday, May 25th, 2020, 10:12:15 AM IST

గతకొంత కాలంగా మహమ్మారి కరోనా వైరస్ ఎన్ని దారుణాలను సృష్టిస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పటికే మనదేశంలో మహమ్మారి కరోనా వైరస్ వలన బారినపడి ప్రాణాలు కోల్పోగా, కొన్ని లక్షల మందిలో ఈ వైరస్ ఇప్పటికి కూడా సజీవంగానే ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. కాగా ఈ క్రమంలో వైరస్ భారిన పడ్డవారిని క్వారెంటైన్ కేంద్రాల్లో ఉంచుతూ, వారికి అవసరమైన చికిత్సని అందిస్తున్నారు. అయితే క్వారెంటైన్ కేంద్రంలో ఉన్నటువంటి ఒక మహిళా తన భర్త కోసమని పారిపోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రము, యశవంతపుర్ లోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.

కాగా బెళగావి జిల్లా గోకాక్‌ తాలూకా పంజానట్టికి చెందిన ఒక మహిళా ఇటీవల తన స్వగ్రామానికి చేరుకుంది. అయితే వేరే ప్రాంతం నుండి ఆ మహిళా వచ్చిన విషయాన్నీ తెలుసుకున్న అధికారులు తన బిడ్డతో సహా ఆ మహిళను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితేఆ మహిళా భర్త ఇటీవల ఒక నేరం చేసి గడుపుతున్నాడు. కాగా ఇటీవల పెరోల్ పై విడుదలైన తన భర్త బయటకు వచ్చిన విషయాన్నీ తెలుసుకున్న ఆ మహిళా, ఎవరికీ తెలియకుండా క్వారంటైన్‌ నుండి పరారయ్యింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆమెకోసమని గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దంపతులిద్దరు హుక్కేరి తాలూకా బెల్లద బాగేవాడి గ్రామంలో బంధువుల ఇంటిలో ఉన్నట్లు గుర్తించి, పోలీసులు పట్టుకోని పంజానట్టికి తీసుకువచ్చి, ఆ దంపతులిద్దరిని క్వారెంటైన్ కేంద్రానికి తరలించారు.