మంత్రిపై అత్యాచారం కేసు.. పెన్ డ్రైవ్ లో రాసలీలలు

Saturday, September 30th, 2017, 09:15:23 AM IST


గురుదాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో పీడబ్ల్యూడీ, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన మాజీమంత్రి, సీనియర్ నాయకుడు సూచా సింగ్ లంగాహ్ (57)పై అత్యాచారం కేసు నమోదైంది. 39 ఏళ్ల ప్రభుత్వ మహిళా ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2009 సంవత్సరం నుంచి సూచా సింగ్ తనపై అత్యాచారం చేస్తున్నాడని అత్యాచారానికి సాక్ష్యంగా మాజీమంత్రి వీడియో క్లిప్ లున్న పెన్ డ్రైవ్ లో ఉన్నాయని దాన్ని పోలీసులకు అందజేసింది. అంతే కాకుండా తన ఆస్తులను కూడా మంత్రి అన్యాయంగా విక్రయించి డబ్బు తీసుకొని మోసం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. గురుదాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక మరో పదిరోజుల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతలు ఈ విషయాన్నీ కొట్టి పారేస్తున్నారు.

Comments