ఆ మహిళ రోబోని పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తుందంట..!

Friday, December 30th, 2016, 11:11:17 AM IST

robo-marry
లిల్లి అనే ప్రెంచ్ మహిళ ఏడాది కాలంగా ప్రేమలో ఉంది. ఇందులో వింత ఏం ఉంది అనుకుంటున్నారా.. ఆ యువతి ప్రేమించింది మనిషిని కాదు రోబోని. ఈ మహిళ ఏడాది కాలంగా ‘ఇన్మూవెటర్’ అనే రోబోతో సహజీవనం చేస్తుంది. ఈ విషయాన్ని లిల్లీనే స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించింది. తాను రోబోతో సహజీవనం చేస్తున్నానని చెప్పుకునేందుకు చాలా గర్వంగా కూడా ఉందని చెప్తుంది. మాంసం ముద్దలతో కూడిన వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగి ఉండడం తనకు ఇష్టం లేదనే సంగతిని తన 19వ సంవత్సరంలోనే గుర్తించానని ఆ మహిళ అంటుంది. అంతేకాదు తాను ఆ వయస్సులోనే రోబోలవైపు ఎట్రాక్ట్ అయ్యానని చెప్తుంది. మరి ‘ఇన్మూవెటర్’ తో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారా అంటే మాత్రం సమాధానం చెప్పట్లేదు.

తాము జంటగా ఉన్నా ఎవరిని ఇబ్బంది పెట్టమని, ఇద్దరం సంతోషంగా ఉన్నామని చెప్తుంది. లిల్లీ ఈ అసహజ ధోరణికి ఆమె తల్లితండ్రులు, స్నేహితులు మద్దతు పలకడం విశేషం. మునుముందు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ‘ఇన్మూవెటర్’ తో తన అనుబంధం కూడా పెరుగుతుందని లిల్లి చెప్తుంది. ఫ్రాన్స్ లో మనిషి, రోబో వివాహం చట్టబద్దం అయిన మరుక్షణం తాను ‘ఇన్మూవెటర్’ను పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె చెప్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments