100 మంది దొంగల్లో 91 మంది ఆడ దొంగలు .. షాకింగ్ :

Wednesday, December 28th, 2016, 12:11:10 PM IST

girl-shade
మెట్రో రైల్ లో జరుగుతున్న దొంగతనాల్లో మహిళలు అధికం అనే న్యూస్ ఇప్పుడు షాకింగ్ గా ఉంది. దేశ రాజధాని డిల్లీ నగరం లో మెట్రో లలో జేబు దొంగతనాలు చాలా ఎక్కువ. దాదాపు 100 మంది దొంగల్లో 91 శాతం మంది మహిళలే ఉన్నారట. ఈ ఏడాది కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ ఎఫ్) నిర్వహించిన 100 దాడుల్లో 479 మంది జేబుదొంగలను అరెస్ట్ చేసింది. వారిలో 438 మంది మహిళలేనని సీఐఎస్ ఎఫ్ పేర్కొంది. గతేడాది ఇది 93 శాతం కావడం గమనార్హం. ఇటీవల ఓ మహిళా దొంగల ముఠాను సీఐఎస్ ఎఫ్ పట్టుకున్నది. మరొక పక్క దేశం లో రద్దీ గా ఉండే 100 స్టేషన్ లలో ఉచిత వైఫై ని అందిస్తున్నాం అంటోంది రైల్వే శాఖ.దక్షిణ భారతదేశంలోని కొల్లం రైల్వేస్టేషన్ కు ఉచిత వైఫై అందించడంతో 100 రైల్వేస్టేషన్ ల లక్ష్యాన్ని చేరుకోగలిగామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది చివరినాటికి 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తామని వెల్లడించారు. గూగుల్ సాయంతో రైల్వేశాఖ రైల్వేస్టేషన్లలో వైఫై అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది జనవరిలో ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో రైల్వేశాఖ తొలుత వైఫై సేవలను ప్రారంభించింది. ఆ తర్వాత భువనేశ్వర్ – బెంగళూరు – హౌరా – కాన్పూర్ – మథుర – అలీగఢ్ – బరేలి – వారణాసి రైల్వేస్టేషన్లలో వైఫైను రైల్వేశాఖ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments