ట్రంప్ కు వ్యతిరేకంగా కదం తొక్కిన మహిళలు..!

Sunday, January 22nd, 2017, 06:28:30 PM IST

piiii
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగుతున్నాయి.కాగా శనివారం మహిళలంతా ఏకమై ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. శనివారం అమెరికా లోని అన్ని స్టేట్స్ లో కలపి 10 లక్షలకు పైగా మహిళలు రోడ్ ల పైకి వచ్చి ట్రంప్ మాకోద్దంటూ నినాదాలు చేశారు. దేశ రాజధాని వాషింగ్టన్ లో మహిళలు ట్రంప్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ఉద్యమంలో పాప్ స్టార్ మడోన్నా కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఆమె ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. వేదికపైకి ఎక్కినా మడోన్నా వెల్ కమ్ టు ది రివొల్యూషన్ ఆఫ్ లవ్ అంటూ ఆమె ప్రసంగించారు. మేము భయపడం.. వెనక్కి తగ్గం అటూ ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. మా ఐక్యత ముందు ఏ శక్తి నిలువ లేదని మడోన్నా అన్నారు. లండన్, మెక్సికో వంటి చోట్ల కూడా అమెరికా దౌత్య కార్యాలయాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు.పలు చోట్ల ట్రంప్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసారు. మహిళల ఉద్యమం పై ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మీడియా సంస్థలు ఈ నిరసనలను బూతద్దంలో పెట్టి చూపిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ట్రంప్ మండి పడ్డాడు.

ఫోటోల కోసం క్లిక్ చేయండి