మగవాడు ఆడదానికి అందుకే అవసరం అంటున్న టాప్ హీరోయిన్

Wednesday, December 28th, 2016, 11:37:46 AM IST

priyanka
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంకా చోప్రా తాజాగా హాలీవుడ్ పై కూడా కన్నేసింది. తాజాగా ప్రియాంకా నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’. దీని ట్రైలర్ కూడా ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ప్రియాంకా విలన్ గా నటిస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ లో కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించడంపై ఆమె వివరణ ఇస్తూ తరువాత రిలీజ్ అయ్యే ట్రైలర్ లో తన స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుందని, ఈ సినిమాలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించానని ప్రియాంకా అంటుంది. తాజాగా ఆమె అసోం టూరిజం శాఖ ప్రచారకర్తగా నియమితురాలైంది.

ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో ఫెమినిజం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ స్వంతంగా ముందుకెళ్తున్నారని, మగవాడి మీద ఆధారపడి బ్రతికే రోజులు పోయాయని ఆమె అన్నారు. ఆడవారికి కేవలం శృంగార అవసరం తీర్చుకునేందుకే మగవాడి అవసరం ఉందని ప్రియాంకా వ్యాఖ్యానించింది.

  •  
  •  
  •  
  •  

Comments