చిరంజీవి ఇంట్లోనే ఉంటూ ఘరానా మోసం చేసిన ఘనుడు !

Monday, November 6th, 2017, 03:12:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో చోరీ జరిగింది. ఈ మేరకు నేడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఫిర్యాదు చేసాడు. అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి రూ 2 లక్షల రూపాయలతో పరారైనట్లు తెలుస్తోంది. చెన్నయ్య అనే వ్యక్తి గతంలో కూడా పలు విడతలుగా చోరీకి పాల్పడ్డాడని కానీ ఆ విషయం చిరు కుటుంబ సభ్యలు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.

కాగా పోలీస్ లు ప్రస్తుతం చెన్నయ్య కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరు 151 వ చిత్రం సైరా కోసం సిద్ధం అవుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments