బిగ్ న్యూస్ : యూఎస్ లో ఒక్కరోజులో వరల్డ్ రికార్డు స్థాయి కరోనా కేసులు!

Tuesday, March 24th, 2020, 08:23:16 AM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం.ఒక్కో దేశంలో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు కావడం అలాగే మరోపక్క మరణ రేటు అమాంతం పెరిగిపోతున్నాయి.

తాజా వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా ఈ దేశంలో కూడా నమోదు కానీ విధంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.

ప్రపంచ అగ్ర రాజ్యం యునైటెడ్ స్టేట్స్ అమెరికా లో కేవలం 24 గంటల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయట. గత 24 గంటల్లో ప్రపంచంలో ఎక్కడా ఈ స్థాయి కేసులు నమోదు కాలేదట.

ఈ ఒక్క దెబ్బతో ఒక్కసారిగా అమెరికాలో 44 వేలకు కరోనా కేసులు చేరిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కరోజులో ఇంత మొత్తం అంటే చాలా దారుణం అనే చెప్పాలి.ఈ మహమ్మారి పీడ ఎప్పుడు వదులుతుందో ఏంటో..