ప్రపంచంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న 10 ప్రాచీన భాషలు ఏవో మీకు తెలుసా..?

Sunday, December 2nd, 2018, 03:08:19 AM IST

ఈ సృష్టిలో మనుషులు గాని ఏ ఇతర జాతి జీవులు గాని వాటి యొక్క భావాలను అవతలి వారికి అర్ధమయ్యేలా చెప్పాలంటే వాడేది “మాట” లేదా “పదం”. అయితే ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అనేక రకాలుగా ఎన్నో వేల భాషలుగా విడిపోయింది.అయితే ఈ సృష్టి ఏర్పడి ఎన్నో లక్షల సంవత్సరాలు గడిచినా ఇప్పటికి కొన్ని ప్రాచీన భాషలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి అంటే మీరు నమ్మగలరా..? అలాంటివే కొన్ని టాప్ 10 భాషలు మీకోసం.

1.హెబ్రూ : ఇది ఇజ్రాయిల్ కి చెందిన ప్రాచీన భాష.దాదాపు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రిందట పుట్టిందట,ఈ భాష ఇప్పటికి వాడుకలోనే ఉంది.

2.తమిళం : దాదాపు 8 కోట్ల మంది భారతీయులు మాట్లాడే భాష.ఇది క్రీస్తు పూర్వం 300 ఏళ్ల క్రిందట ఆవిర్భవించింది.

3.సంస్కృతం : దీనిని భారతీయలు దేవతలు మాట్లాడే భాషగా పరిగణిస్తారు.క్రీస్తు పూర్వం 200 ఏళ్ల క్రిందట ఆవిర్భవించింది.ఈ భాషని కూడా ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.

4.ఫార్సీ : దీనినే “పర్శియన్” భాష అని కూడా అంటారు.ఇరాన్,ఆఫ్గనిస్తాన్ మరియు తజికిస్థాన్ లో మాట్లాడే ఈ భాష క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రిందట ఆవిర్భవించింది.

5.లిత్ యునియన్ : లిత్ యూనియ మరియు పోలాండ్ దేశాలలో ఎక్కువగా ఈ భాషను మాట్లాడుతారు.దాదాపు క్రీస్తు పూర్వం 3500 ఏళ్ల క్రిందట ఈ భాష ఐరోపా లో పుట్టింది.

6.గ్రీక్ : ఈ భాషను ప్రపంచంలోని పండితులు మరియు తత్వవేత్తలు మాట్లాడడానికి ఎక్కువగా వినియోగిస్తారు.ఇది క్రీస్తు పూర్వం 1450 ఏళ్ల క్రిందట ఆవిర్భవించింది.

7.లాటిన్ : పోలాండ్ మరియు వాటికన్ సిటీ లలో ఈ భాషను ఎక్కువగా వినియోగిస్తారు.ఈ భాష క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఆవిర్భవించింది.

8.చైనీస్ : ఇది కూడా ప్రాచీన భాషే..క్రీస్తు పూర్వం 1200వ శతాబ్దంలో ఆవిర్భవించింది.ఈ భాషను ఎక్కువగా చైనా,తైవాన్,సింగపూర్ మరియు ఉత్తర,దక్షిణ ఆసియాల్లో మాట్లాడుతారు.

9.బాస్క్ : ఇప్పటి వరకు విన్న భాషల్లో కన్నా మీరు ఈ భాషనే అతి తక్కువగా విని ఉంటారు.ఉత్తర,దక్షిణ ఫ్రాన్స్ లో ఎక్కువగా మాట్లాడే ఈ భాష,కొన్ని మిలియన్ ఏళ్ల కిందట పుట్టినా ఇంకా వాడుకలోనే ఉంది.

10.అరబిక్ : ఈ భాష అయితే తెలీని వాళ్ళు చాలా తక్కువ ముందే ఉంటారని చెప్పాలి.ఈ భాష క్రీస్తు శకం 328 వ సంవత్సరంలో ఆవిర్భవించి ఇప్పటికీ అనేక దేశాలలో వాడుకలోనే ఉంది.ఎక్కువగా ఈ భాషను సౌదీ అరేబియా,ఇరాన్,ఇరాక్,ఈజిప్ట్ మరియు కువైట్ తదితర దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తారు.