దారుణం : వరంగల్ జిల్లాలో కన్నకొడుకు సజీవ దహనం

Tuesday, November 12th, 2019, 10:12:50 PM IST

వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో కొద్దీ సేపటి క్రితం ఒక దారుణమైన సంఘటన జరిగింది. కన్న కొడుకునే ఒక జంట సజీవ దహనం చేశారు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ జిల్లా కి చెందిన కడారి మహేష్‌చంద్ర ను కన్న తల్లిదండ్రులే, పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కాగా మ్రితుడు మహేష్ చంద్ర మద్యానికి బానిసై నిత్యం భార్య ని వేదింపులకు గురి చేసేవాడు. అతని వేధింపులకు తాళలేక రెండు నెలల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే భార్య వెళ్ళిపోయినప్పటినుండి కూడా మహేష్ తన తల్లిదండ్రులను తీవ్రమైన వేడిముపకు గురి చేశారు. కాగా మద్యం తాగి వచ్చి వారితో తగువులాటకు దిగి, మరింత మద్యం సేవించడానికి డబ్బులు కావాలని తన తల్లిదండ్రులపై దాడి చేశారు. అయితే ఆ దెబ్బలకు భరించలేక మద్యం మత్తులో ఉన్న మహేష్‌చంద్ర చేతులు కట్టేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఈ ఘటనలో మహేష్‌చంద్ర అక్కడికక్కడే తీవ్రగాయాలతో మృతి చెందాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.