అప్పుడు రాక్షసుడు..ఇప్పుడు దేవుడు..నీచంగా ఉన్న అవకాశ రాజకీయాలు.!

Tuesday, December 10th, 2019, 07:09:15 AM IST

రోజులు మారి ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ఈ నీచ రాజకీయాలు మాత్రం మారడం లేదు. అవకాశం కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు అస్సలు మారడం లేదు.నిజంగా వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం లేదో లేక వాళ్ళని మోసేవాళ్ళకి లేదో కానీ వినే జనాలు ఉంటే వాళ్ళని గొర్రెలుగా ఎంత కాలం అయినా సరే ఏమారుస్తూ ఉంటారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకు వచ్చింది అంటే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకామె అసెంబ్లీలో మాట్లాడిన మాటల వల్ల చెప్పుకోవాల్సి వస్తుంది.తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మన రాజకీయ నాయకులు ఎంత వరకు అయినా దిగజారుతారు, అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం.

వైసీపీ మహిళా ఎమ్మెల్యే అయినటువంటి విడదల రజిని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు జగన్ అంటే ఒక నరరూప రాక్షసుడు అని చిన్నపిల్లలు ఎవరైనా సరే రాక్షసుడు ఎలా ఉంటాడు అంటే జగన్ ఫోటో చూపించండి చాలు అని అంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది.అలా చేసి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జగనన్నే దేవుడు ఆయన కుటుంబీకులు అంతా దైవ సామానులు అన్న స్థాయిలో మాట్లాడారు.అప్పుడు రాక్షసుడు ఇప్పుడు దేవుడు అయ్యిపోయాడు.ఏ పార్టీలో ఉంటే ఆ కొమ్ము కాయడం బాగా అలవాటు పడ్డారు ఇలాంటి వాళ్ళను జనాలు మోస్తూనే ఉంటారు.పార్టీ అధినేతలు ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా చేర్చుకుంటున్నారు.జనాలలోనే మార్పు రానంత కాలం ఇలాంటి వాస్తవిక దారిద్య్రాలను ఎన్ని వచ్చినా వ్యవస్థ మారదు.అయినా జగన్ ఇలాంటి వారిని ఎందుకు చేర్చుకుంటున్నారో ఆయనకే తెలియాలి.