భళా జగన్ .. ఇలా జరిగితే సామాన్య ప్రజానీకం అంత మీ వైపే

Tuesday, August 20th, 2019, 10:52:27 AM IST

కొత్త తరం రాజకీయాలు ప్రజలను ఆనంద చకితులను చేస్తున్నాయి. రాజన్న ప్రభుత్వం కోసం ఎన్నో ఏళ్ళు ఎదురుచూసిన ప్రజలకు, అతని వారసుని రూపంలో ప్రజలను, రైతులను మరియు అన్ని వర్గాల ప్రజానీకానికి న్యాయం జరిగేలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు. గత ప్రభుత్వ అవినీతి చర్యలు బయట పెడుతూనే, ప్రస్తుత రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.

సరోకొత్త నిర్ణయంతో జవాబు దారిగా ప్రభుత్వ విధానం. ఇకపై కోటి రూపాయలు దాటినా ప్రతి ఒక్క ప్రభుత్వ ఖర్చులను ప్రభుత్వ వెబ్సైటు నందు పొందుపరచనున్నారు. కోటిరూపాయలు దాటినా ఏ ప్రభుత్వ ఖర్చునైనా ఈ వెబ్సైటు నందు ఇక పై చూడవచ్చును. అమెరికా టూర్ ముందు ప్లాన్ చేసిన వైయస్ జగన్, ఇపుడు అన్ని విభాగాల పనికి ఇది వర్తిస్తుంది.

ఖర్చు మాత్రమే కాదు, కొనుగోలు వివరణలను, ఎక్కడి నుంచి వచ్చాయి అని, ఇంకా కొనుగోలు దారుడి వివరాలను పొందుపరచనున్నారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా తక్కువ కోట్ చేసిన వ్యక్తికీ ప్రాజెక్ట్స్ వెళతాయి. అందువలన ప్రభుత్వ నిధులు సద్వినియోగంగా ఉపయోగించే ఛాన్స్ వుంది. ప్రతి చిన్న పనికి లేని పోనీ ఖర్చులు పెట్టకుండా ఇలాంటి విధానం తో జనాల్లోకి జగన్ పాలనా ఏంటో నేరుగా తెలుసుకునే అవకాశం వుంది. రివర్స్ టెండరింగ్ తో వేల కోట్ల రూపాయలను ఆదా చేయడమే కాకుండా, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం వచ్చేలా సీఎం జగన్ పనులు వున్నాయి. ప్రతి ఒక్క పని ఫలితాన్ని ఇవ్వకున్నా జగన్ చేసే ప్రతి పనిలో ఇలాంటి పారదర్శకత పనుల వలన కొంతమేరకు ఐన అవినీతి అరికట్టవచ్చు అనేది, విశ్లేషకుల అంచనా.