బాబోయ్ ఖైదీ క్రేజ్ .. తగ్గలేదుగా బాసూ !!

Wednesday, January 25th, 2017, 11:38:42 AM IST

khaidinumber150
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ”ఖైదీ నంబర్ 150” వ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఇప్పటికే స్పీడ్ గా వందకోట్ల మార్కెట్ ను సాధించిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో ఇంకా జోరుగా నడుస్తూ .. మెగాస్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. కేవలం రెండు వారాల్లో ఏకంగా 90 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం రేపింది. ఇక గ్రాస్ విషయానికి వస్తే రెండు వారాల్లో ఏకంగా 115 కోట్ల భారీ వసూళ్లు రాబడుతూ .. ఇంకా జోరుగా నడుస్తుంది. ప్రస్తుతానికి వేరే సినిమాలు ఏవి రాకపోవడంతో ఖైదీ జోరుకు అడ్డే లేకుండా పోయింది. తమిళ కత్తి చిత్రానికి రీమేక్ గా వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో టాప్ వసూలు సాధించిన సినిమాల్లో ‘బాహుబలి’ తరువాత శ్రీమంతుడు సినిమాతో మహేష్ దే ఆ క్రెడిట్ .. అయితే మెగాస్టార్ దెబ్బకు మహేష్ రెండో ప్లేస్ లోకి వచ్చేలా ఉన్నాడు మరి !!