వావ్ ..అదరగొట్టిన మహేష్ న్యూ లుక్?

Saturday, September 8th, 2018, 06:13:23 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమెరికాలో షెడ్యూల్ మొదలు పెట్టిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకోసం ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేష్ ని ఫోటో షూట్ చేసారు. ఈ ఫోటో షూట్ కి సంబందించిన ఫోటోను మహేష్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు .. ఆ లోక్ ని చుసిన జనాలంతా షాక్ అయ్యారు. ఆ ఫోటోలో మహేష్ న్యూ లుక్ అదిరిపోయింది. నిజంగా అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు జలస్ పుట్టించేలా ఉన్నాడు మహేష్. చార్మింగ్ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ కూడా పడుతున్నాయి. అసలే అందగాడు .. పైగా ఈ న్యూ లుక్ లో అబ్బో .. చెప్పేందుకు మాటలు లేవు !! మహర్షి సినిమాతో పాటు మహేష్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి మన సూపర్ స్టార్ అదిరిపోయే లుక్ పై మీరు ఓ లుక్ వేయండి.

  •  
  •  
  •  
  •  

Comments