అబ్బా ఇదేమి కొత్త సంప్రదాయం శిరీష్ !

Monday, February 19th, 2018, 08:41:28 PM IST

టాలీవుడ్ లో హీరోల అభిమానులు రోజుకోరకం కొత్త పోకడలను అలవాటు చేస్తున్నారు. అందునా ఈ డిజిటల్ యుగం లో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదైనా కొత్త చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ కానీ, లేదా టీజర్ లేక ఏదైనా పాట లాంటివి విడుదల కావలసివుంటే దానికి కొద్దిరోజులముందు నుండి ఆ హీరోల అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. అంతే కాక చిత్రం విడుదలకు ఇన్ని రోజులు సమయం ఉందని మనకు ఆ చిత్ర యూనిట్ నుండి కూడా ఫోటోలు విడుదలవడం చూస్తుంటాం. అదే సోషల్ మీడియా లోని ట్విట్టర్ వంటి వాటిలో అయితే ఆ చిత్రం తాలూకు హాష్ టాగ్ లతో మొత్తం హోరెత్తినచేస్తుంటారు. మనం ప్రస్తుతం మాట్లాడుకునేది వీటన్నిటికీ కొంచెం భిన్నమైనదే. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు అల్లు అర్జున్ సోదరుడు అయినా అల్లు శిరీష్ గౌరవం చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఆ తరువాత శ్రీరస్తూ శుభమస్తు, కొత్త జంట, ఒక్క క్షణం చిత్రాలలో ఆయన నటించిన విషయం విదితమే. ప్రస్తుతం అయన అభిమానులు ఒక ఆసక్తికర ఫోటో ని పోస్ట్ చేస్తూ ఆయన పుట్టిన రోజుకు ఇంకా 100 రోజులు మిగిలి ఉండగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తూ ఒక కొత్త రకమైన సంప్రదాయానికి తెర తీస్తూ హడావుడి మొదలెట్టేసారు అయన అభిమానులు. అయితే ఆ ఫోటోని కొందరు ట్రోల్ చేయడం కూడా మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఏదో సినిమా విడుదలకు, మొదటి లుక్ విడుదలకో ఇన్ని రోజులు సమయం వున్న ఫోటోలు చూస్తున్నాం, కానీ ఇదేంటి రా అనుకున్నారా. ఇది శిరీష్ అభిమానులు ఆయనపై చూపిస్తున్న కొత్త రకమైన అభిమానానికి నిదర్శనంగా చెప్పక తప్పదు మరి.