ఎం సేబితిరి.. పవన్ కళ్యాణ్ పై అనంత శ్రీరామ్ అద్బుతమైన మాట!

Tuesday, September 26th, 2017, 05:30:29 PM IST


తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే కామన్ తెలుగు సినిమా ప్రేక్షకుడు నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది అభిమానులు ఉంటారు. అలాగే పవన్ వ్యక్తిత్వం అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీతో ప్రజా సమస్యల మీద పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పోరాటం చేస్తున్నాడు. త్వరలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా టర్న్ తీసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కావాలనే ఆలోచనతో ఉన్నాడు. అయితే అతని ప్రయాణం గురించి కామెంట్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా ఇండో యూరోపియన్ ఫోరం పవన్ కళ్యాణ్ కి సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. దాంతో గ్లోబల్ బిజినెస్ మీటింగ్ కి రావాలని పవన్ కి ఆహ్వానం అందించారు.

ఇప్పుడు ఈ అవార్డ్ మీద గేయ రచయిత తనదైన శైలిలో స్పందించి, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాడు. విమర్శించిన వారికి అభిమానుల చీత్కారం, విమర్శించబడిన వారికిన అంతర్జాతీయ పురస్కారం, ఇదేనేమో కత్తిలాంటి కర్మ సాక్షాత్కారం అనే మాటని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. కాస్తా ఛలోక్తి నిండిన ఈ విమర్శ ఎవరికీ అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భాగా అర్ధం కావడంతో ఇప్పుడు, అతని కామెంట్స్ ని షేర్ చేస్తూ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments