భావోద్వేగంతో పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్!

Wednesday, May 30th, 2018, 08:58:56 PM IST

తెలుగు సినిమా పరిశ్రమలో మరచిపోలేని గుర్తింపు తెచ్చుకున్న దర్శుకులు శ్రీ దాసరి నారాయణ రావు. ఎంతో మంది నటీనటులకు అవకాశం ఇచ్చి మార్గదర్శకంగా నిలిచారు. ఆయన మరణం తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందని చిత్ర పరిశ్ర్రమలో చాలా మంది మంది ప్రముఖులు తెలియజేశారు. గత ఏడాది 30న దాసరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్బంగా చిత్ర పరిశ్రమ దాసరికి నివాళులు అర్పించింది.

ఇక కొంత మంది సినీ నటులు సోషల్ మీడియా ద్వారా దర్శకరత్న ను తలచుకున్నారు. ముఖ్యంగా దాసరికి సన్నిహితులైన రచయిత పరుచూరి గోపాల కృష్ణ గారు కూడా దాసరిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఎక్కడికి వెళ్లారు గురువుగారు మీరు ?చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిశాఖలోని ప్రతి వ్యక్తి హృదయంలో వున్నారు! వుంటారు !! మీ అడుగుజాడల్లో నడుస్తూ, మీరు చూపించిన పరిష్కార మార్గాలు అనుసరిస్తూ ఉంటాము.మీకు జోహార్లు దాసరి నారాయణ రావు గారు” అంటూ ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments