ర‌చ‌యిత ఆత్మ‌హ‌త్యాయ‌త్నం వెన‌క‌?

Thursday, May 17th, 2018, 02:36:10 PM IST

సినీప‌రిశ్ర‌మ‌కు ఎన్నో ఆశ‌ల‌తో వ‌స్తుంటారు. ఇక్క‌డ 24 శాఖ‌ల్లో ఏదో ఒక చోట ఉపాధి పొందాల‌నుకునేవారు కొంద‌రైతే, ఇండ‌స్ట్రీని ఏలాల‌ని మ‌రి కొంద‌రు ఎర్ర బ‌స్సెక్కి వ‌స్తుంటారు. అలా వ‌చ్చిన‌వాళ్లు చాలా వ‌ర‌కూ ఇక్క‌డ స‌న్నివేశం అర్థ‌మై వెనుదిరిగిపోతుంటారు. కొంద‌రైతే ఏదో ఒక‌టి తేల్చుకోవాల‌ని మొండికేసి తుదికంటా పోరాటం సాగిస్తుంటారు. ఆ రెండో కోవ‌కే చెందుతాడు రైట‌ర్ రాజ‌సింహా. అత‌డు సిద్ధార్థ్ – శ్రుతిహాస‌న్ న‌టించిన `అన‌గ‌న‌గ ఓ ధీరుడు` చిత్రానికి కథార‌చ‌యిత‌గా ప‌నిచేశారు. ఆ క్ర‌మంలోనే ఎన్నో క్రేజీ సినిమాల‌కు రాజ‌సింహా క‌థ‌, మాట‌ల విభాగంలో ప‌ని చేశారు. ఇటీవ‌లే బంప‌ర్ హిట్ కొట్టిన గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు డైలాగులు రాసింది రాజ‌సింహా. బొమ్మ‌రిల్లు, బోణి, ఒక్క అమ్మాయి త‌ప్ప (సందీప్ కిష‌న్‌), కాళిదాసు చిత్రాల‌కు ఆయ‌న ర‌చ‌యిత‌గా కొన‌సాగారు.

అయితే ఎంత రాసినా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌త స్థాయిని అందుకోలేక‌పోయాన‌న్న నిరాశ అత‌డిని ఆవరించిందో ఏమో.. రాజ‌సింహా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం సాటి ర‌చ‌యిత‌ల్ని విస్మ‌యానికి గురి చేసింది. నిజానికి అత‌డేమీ మ‌రీ చిన్నా చిత‌కా ర‌చ‌యిత అయితే కాదు. చెప్పుకోద‌గ్గ సినిమాల‌కే ప‌ని చేశాడు. అయితే ఇటీవ‌లి కాలంలో ఆశించిన అవ‌కాశాల్ని అందిపుచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మై ఒత్తిడికి లోన‌య్యాడ‌ని, ఆ క్ర‌మంలోనే అత‌డు ముంబైలోని ఓ హోట‌ల్లో నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని చెబుతున్నారు. నిద్ర‌మాత్ర‌ల మోతాదు అధిక‌మ‌వ్వ‌డంతో అత‌డు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. అది గ‌మనించిన హోట‌ల్ సిబ్బంది వెంట‌నే ఆస్ప‌త్రికి చేర్చ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. రాజ‌సింహా ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments