కాశ్మీర్ పాకిస్తాన్ దే..చైనా మద్దతు ఇచ్చినట్లేనా !

Wednesday, October 9th, 2019, 08:04:58 PM IST

యావత్తు ప్రపంచంలో పాకిస్తాన్ కి ప్రత్యేకంగా, పరోక్షంగా మద్దతు పలికే దేశంగా చైనాకి పేరుంది. ఎదో పాకిస్తాన్ గొప్ప దేశమని దానికి వత్తాసు పలకటం లేదు చైనా. ఇండియాతో పాకిస్తాన్ కి ఉన్న విభేదాలను క్యాష్ చేసుకొని ఇండియాని దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే పాకిస్తాన్ కి చైనా మద్దతు ఇస్తూ వస్తుంది. ఆసియా ఖండంలో చైనాకి దీటుగా ఇండియా ఎదుగుతుంది, ఆ ఎదుగుదలకి అడ్డుకోవటానికి పాకిస్తాన్ తో చైనా చేతులు కలిపి ఇండియాకి చెక్ పెట్టాలని చూస్తుంది.

తాజాగా బీజింగ్‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ను క‌లిసిన త‌ర్వాత జీ జిన్‌పింగ్ మరోసారి పాక్ కి మద్దతుగా ప్రకటన చేశాడు. అది కూడా కాశ్మీర్ విషయంలో పాక్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ కాశ్మీర్ గురించి, అక్కడ జరుగుతున్నా విషయాలు గురించి ఇమ్రాన్ నాతో అన్ని విషయాలు చెప్పాడు. కాశ్మీర్ విషయంలో మా మద్దతు పాకిస్తాన్ కి ఉంటుందని జీ జిన్‌పింగ్ ప్రకటించాడు. కాశ్మీర్ అంశం అంతర్జాతీయ స్థాయిలో వివాదం అయినా తర్వాత ఏ దేశం కూడా పాకిస్తాన్ కి అనుకూలంగా ప్రకటన చేయలేదు.

నేడు మాత్రం చైనా బహిరంగంగా పాకిస్తాన్ కి మద్దతు తెలిపటం జరిగింది. ఎప్పటి నుండో ఇండియా మీద తమ వక్ర బుద్ది చూపిస్తున్న చైనా ఇప్పుడు కూడా అదే విధంగా మరోసారి తమ బుద్దిని చాటుకుంది. ఈ వారమే జీ జిన్‌పింగ్ ఇండియా పర్యాటనికి వస్తున్నాడు. చైన్నైలో మోదీ, జీ జిన్‌పింగ్ ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మరి ఆ సమయంలో మోదీ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.