యుద్ధ‌న‌పూడిని కాపీ కొట్టిన‌ మాంత్రికుడు?

Monday, May 21st, 2018, 05:44:00 PM IST

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి యుద్ధ‌న‌పూడి సులోచ‌నా రాణి మ‌ర‌ణించార‌న్న వార్త అభిమానుల్లో విషాదం నింపింది. మేటి న‌వ‌లా ర‌చ‌యిత్రి యుద్ధ‌న‌పూడి ఇక లేరు అన్న వార్త‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పాఠ‌కులు ఏమాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆ క్ర‌మంలోనే యుద్ధ‌న‌పూడి రాసిన ప‌లు న‌వ‌ల‌ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యుద్ధ‌నపూడి రచ‌న `మీనా` అప్ప‌ట్లో ఓ పసంచ‌ల‌నం. ఆ న‌వ‌ల కాపీ రైట్స్ కొనుక్కుని విజ‌య‌నిర్మ‌ల `మీనా` చిత్రాన్ని తెర‌కెక్కించారు. కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషించిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఓవైపు న‌వ‌ల గురించి, మ‌రోవైపు సినిమా గురించి జ‌నం ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకున్నారు. ఆ త‌ర‌వాత 2016లో రిలీజైన అ.. ఆ సినిమా ఇదే కాన్సెప్టుతో వ‌చ్చింద‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి. త్రివిక్ర‌మ్ ఆ న‌వ‌ల‌ను కాపీ చేసి ఈ సినిమా తీశార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నేడు యుద్ధ‌న‌పూడి మ‌ర‌ణానంత‌రం దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒకానొక సంద‌ర్భంలో ఆ సినిమా క‌థ నేను రాసుకున్న‌దేన‌ని త్రివిక్ర‌మ్ చెప్పినా న‌వ‌లా స్ఫూర్తి ఉంద‌ని అభిమానులు ముచ్చ‌టించుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments