అమ్మ .. యామి.. నీ ఐడియా అదిరిందమ్మా ?

Wednesday, May 23rd, 2018, 10:00:40 AM IST

బాలీవుడ్ లో మొదలైన బయోపిక్ సినిమాల హవా సౌత్ కి పాకింది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాల్లో నటించేందుకు పలువురు హీరోయిన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ హాట్ భామ యామి గౌతమ్ కు రెండు బయోపిక్ సినిమాల్లో నటించాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీకి ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావడం లేదు. పోనీ చేసిన సినిమాలు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో మంచి క్రేజీ సినిమాలు చేసి తన ఇమేజ్ పెంచుకోవాలని సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇలా చెప్పింది. ఇంతకీ యామి గౌతమ్ కు నచ్చిన రెండు బియోపిక్స్ ఏమిటో తెలుసా .. ఒకటి ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా జీవిత కథ అయితే .. మరొకటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మధుబాల జీవిత కథ. ఈ రెండు కథలు నా దగ్గరికి వస్తే మాత్రం నో చెప్పనని అంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments