టీడీపీ అధికార ప్రతినిధికి తప్పని వేధింపులు…

Monday, June 10th, 2019, 09:23:41 PM IST

ఇటీవల ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే… కాగా ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటినుండి టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని బయట పెద్దగా కనిపించడమే మానేశారు… అయితే ఎన్నికలకు ముందు ప్రత్యర్ధులమీద తనదైన శైలిలో విరుచుకుపడ్డటువంటి యామిని గత కొంతకాలంగా చతికిలపడిపోయారని రాజకీయవర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. టీడీపీ పార్టీ తరపున అధికార ప్రతినిధిగా నియమితురాలైనటువంటి యామిని సాదినేని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు అనుకోని పరిస్థితిలో యామిని మీడియా ముందుకి వచ్చింది. ప్రత్యర్థులందరు కూడా తనమీద కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికలకు ముందు నాయకులందరినీ కూడా ఒక ఆట ఆడుకున్నటువంటి యామిని, తనకి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్లు చేసిన వారిపై కేసులు వేసి జైల్లో పెట్టించారు యామిని. అయితే ఆలా యామిని విషయంలో జైలుకి వెళ్లిన కొందరు ఇప్పుడు తనని కావాలనే టార్గెట్ చేసి పలు విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమయ సందర్భాలు లేకుండా అర్థరాత్రుల్లో కూడా తనకి ఫోన్స్ చేసి బెదిరిస్తున్నారని, పేస్ బుక్ లో తన పేరు మీద నకిలీ అక్కౌంట్ల ను తెరిచి ఇబ్బందికర పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని స్వయంగా యామిని సాదినేని డి.జి.పి కి ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కోన్నారు. కాగా యామిని ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి…