రాష్ట్ర పరిస్థితులు వివరించాం

Wednesday, October 15th, 2014, 04:51:01 PM IST

yanamala-ramakrishnudu-and-
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులగురించి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కు వివరిచినట్టు ఏపి ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపి సుజనా చౌదరి తెలియజేశారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ను యనమల, సుజనా చౌదరిలు కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయని… రైతులు తుఫాన్ కారణంగా ఎంతో నష్టపోయారని వివరించినట్టు వారు తెలిపారు. రైతు సాధికార కార్పోరేషన్ గురించి రఘురాం రాజన్ కు వివరించినట్టు వారు తెలియజేశారు. ఏపిలో బ్యాంక్ ఎకౌంటుకు ఆధార్ ను లింక్ చేసినట్టు వివరించామని.. దానికి రఘురాం రాజన్ అభినందించారని అన్నారు. విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి స్థలం ఏర్పాటు చేయాయాలని రఘురాం రాజన్ కోరినట్టు యనమల, సుజనా చౌదరి తెలియజేశారు.