మద్యం క్యూల నిర్వహణకు లేని అభ్యంతరాలు ఎన్నికలకి ఉంటాయా?

Sunday, January 10th, 2021, 02:35:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో అటు ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం మరియు ఇటు అధికార పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్దాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికల నిర్వహణ విషయం లో ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పగా, ప్రభుత్వం ఇంకా అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తోంది అంటూ టీడీపీ నేతలు అంటున్నారు. అయితే మరొకసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిణామాల పై గవర్నర్ ఉపేక్షించరాదు అని, తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలిపారు. అయితే ఆర్టికల్ 243 ఏ, 243 కే 1 ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఈ సి దే నని తేల్చి చెప్పారు.

అయితే పంచాయతీ ఎన్నికలకి కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నర్ అంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అయితే రాష్ట్రం లో నెలకొన్న పరిస్తితిలు అర్టికిల్ 356 ను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి అని తెలిపారు. అంతేకాక ఎన్నికల నిర్వహణ కి సహకరించేది లేదు అని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలో నే లేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ఎన్నికలకి ఉద్యోగ సంఘాల నేతలు కూడా సహకరించం అని చెప్పడం ఏ రాష్ట్రంలో కూడా లేదు అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అయితే మద్యం క్యూల నిర్వహణ కి లేని అభ్యంతరాలు పంచాయతీ ఎన్నికలకి ఉంటాయా అంటూ వైసీపీ ప్రభుత్వం ను నిలదీశారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఉందని 2022 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక స్థానిక సంస్థల ఎన్నికలుఎదుర్కొనే ధైర్యం జగన్ అండ్ కో కి లేకనే ఈ జగన్నాటకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.