ఎవరికి, ఎందుకు ఓటేయాలో ప్రజలు పరిశీలించాలి – యనమల రామకృష్ణుడు

Sunday, February 28th, 2021, 02:20:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానం పై మరొకసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన లో ఆ పార్టీ నేతల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదు అని విమర్శలు చేశారు. అయితే పట్టణ ప్రాంతాల్లో 20 నెలలు గా అభివృద్ధి లేదు అన్నది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే రెండు ఆర్ధిక సంవత్సారాల్లో కేటాయింపుల కి తగ్గ ఖర్చులు లేవు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాక కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదు అని ఆదివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

అయితే వైసీపీ 20 నెలల పాలన ను తెలుగు దేశం పార్టీ పాలన తో బేరీజు వేసుకొని మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలి అంటూ ప్రజలకు సూచించారు. అంతేకాక ఎవరికి, ఎందుకు ఓటేయాలో ప్రజలు పరిశీలించాలి అని వ్యాఖ్యానించారు. సుపరిపాలన ఎవరు ఇస్తారు అనేది ప్రజలు ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు.అయితే మేనిఫెస్టో లోని అంశాలను తెలుగు దేశం పార్టీ తప్పక నెరవేరుస్తుంది అని యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో అనేక వర్గాలు జీవనోపాధి కోల్పోయారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది అని అన్నారు. రాష్ట్రం లో శాంతిభద్రతలు లోపించి, నేరాలు పెరిగిపోయాయి అంటూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.