రైతుసంక్షేమమే ప్రభుత్వద్యేయం

Tuesday, September 30th, 2014, 05:20:36 PM IST


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణమాఫీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బ్యాంకర్లను కోరారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రుణాలమాఫీ చేయడం కోసం ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నిస్తున్నదని..ఆయన తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ లో ఆశించనంతమేర రుణవితరణ జరగలేదన్న విషయాన్ని యనమల అంగీకరించారు. అయితే, రుణాలమాఫీ జరగకపోవడంతో.. బ్యాంకునగదు నిల్వలలో భారీగా తేడా ఏర్పడిందని బ్యాంకర్లు యనమలకు వివరించారు.. కాగ, సమస్యను అర్ధం చేసుకున్నామని, రేపు జరగబోయే..మంత్రివర్గసమావేశంలో.. రుణాలమాఫికోసం ఎంతమొత్తంలో నిధులు విడుదల చేయాలి అన్న విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని యనమల ఈ సందర్భంగా అన్నారు.