యండ‌మూరి వ‌ర్సస్ మెగాస్టార్‌.. మ‌ళ్లీ ఏమైంది?

Thursday, February 23rd, 2017, 05:33:34 PM IST


ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ వ‌ర్సెస్ మెగా ఫ్యామిలీ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ గురించి యండ‌మూరి చేసిన అనుచిత వ్యాఖ్య‌లు మెగా ఫ్యాన్స్‌లో క‌ల్లోలం రేపింది. దీనిపై మెగా హీరోలంతా సీరియ‌స్‌గానే స్ప ందించారు. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు `ఖైదీనంబ‌ర్ 150` ప్రీరిలీజ్ వేడుక‌లో యండ‌మూరిపై చెల‌రేగిపోయారు. ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ సైతం యండ‌మూరి సంస్కారాన్ని ప్ర‌శ్నించారు. ఆ ఇష్యూ అక్క‌డితో అయిపోయిన‌ట్టు లేదు. యండ‌మూరి వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా క‌క్ష తీర్చుకుంటున్నార‌న్న ప్రూఫ్‌తో ఓ వీడియో సామాజిక మాధ్య‌మంలోకి వ‌చ్చి చేరింది.

“మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు? (ఎంఇకె) కోసం రూ.15 ఖ‌ర్చు చేసి మెసేజ్‌లు పంపాలుట‌. మ‌నం వారిని ధ‌న‌వంతుల్ని చేయాల‌ట‌. అందుకోసం పేద‌లు సైతం ఒక్కో మెసేజ్‌కి ఐదు రూపాయ‌లు ఖ‌ర్చు చేసి మెసేజ్‌లు పంపాలుట‌… జ‌నాల్ని వెర్రివాళ్ల‌ను చేస్తున్నార“ంటూ యండ‌మూరి ఈ వీడియో సాక్షిగా సీరియ‌స్ గా క్లాస్ తీస్కుంటున్నారు. అమితాబ్ కెబిసి, నాగార్జున ఎంఇకె ఇదే త‌ర‌హాలో న‌డిచిన‌ప్పుడు చేయ‌ని కామెంట్స్ చిరు హోస్లింగ్ చేస్తున్న‌ప్పుడే యండ‌మూరి ఎందుకు చేస్తున్న‌ట్టు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు మెగాఫ్యాన్స్‌. మ‌రి వీటికి అట్నుంచి స‌మాధానం ఏంటో?