కర్నూలు జిల్లాలో దారుణం..దారి కాచి దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు.!

Saturday, June 1st, 2019, 01:35:25 PM IST

జగనన్న వస్తే రాజన్న రాజ్యం తెస్తాడు అని ఒక పక్క వైసీపీ శ్రేణులు అంటుంటే మరోపక్క జగన్ అధికారంలోకి వస్తే వచ్చేది రాజన్న రాజ్యం కాదు రౌడీ రాజ్యమే అని ఇతర పార్టీల శ్రేణులు సోషల్ మీడియాలో కొట్టుకుంటారు.అయితే ఇప్పుడు ఆ రెండో మాటనే నిజం చేసే విధంగా కొంత మంది వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తని దారి కాచి దారుణంగా దాడి చేసిన ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

ఇక అసలు వివరాల్లోకి వెళ్లినట్టయితే కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాలకు చెందిన శివ నారాయణ రెడ్డి అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా వైసీపీకి చెందిన కార్య కర్తలు అతన్ని అడ్డగించి దారుణంగా దాడి చేసారు.వీరి ఘర్షణలో అతనికి తీవ్ర గాయాలు అవ్వడంతో పాటుగా వారు నాపై రాళ్లతో దాడి చెయ్యడం వలన అతని యొక్క రెండు కాళ్ళు కూడా విరిగిపోయాయి.దీనితో అతన్ని అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స నిర్వహించారు.ఇటీవలే జగన్ ముఖ్యమంత్రిలా ప్రమాణ స్వీకారం చేసారు ఇంతలోనే వైసీపీ అభిమానులు తమ ఝులుం ప్రదర్శిస్తున్నారని రాజకీయ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.