ఆశా వర్కర్ల విషయంలో జగన్ పరువు తీసేసిన వైసీపీ నేతలు.!

Thursday, June 6th, 2019, 05:23:31 PM IST

వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తుండడంతోనే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలిచారు.తాను ప్రమాణ స్వీకారం చేస్తుండడంతోనే నాలుగు లక్షల ఉద్యోగాలను ఈ ఆగష్టు లోపు భర్తీ చేస్తానని చెప్పి మరో సంచలనం రేపారు.ఆ కొద్ది లోనే జగన్ ఆశా వర్కర్ల సమస్యలను పరిగణలోకి తీసుకొని వారి జీతాలను కూడా పెంచడంతో జగన్ పై రాష్ట్ర రాజకీయ వర్గాల నుంచి అనేక ప్రసంశలు అందాయి.జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆశా వర్కర్లు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.ఇలా ఓ పక్క జగన్ ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే మరో పక్క వైసీపీ నేతలు మాత్రం నడి రోడ్డుపైనే జగన్ పరువు తీసేస్తున్నారు.

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందటే మామూలుగా జగన్ జీతం పెంచినందుకు గాను కొంతమంది వైసీపీ నేతలు ఓ చోట ఆశా వర్కర్లను పోగేసి దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూల మాల వేసేందుకు తీసుకెళ్లారు.ఇదే సందర్భంలో అక్కడి వైసీపీ అభిమానులు జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేపట్టారు.దీనితో అక్కడి ఆశా వర్కర్లు ఆ నినాదాలు చేయ్యకపోవడంతో ఎవరైతే జై జగన్ అనట్లేదో వారికి రావాల్సిన 10 వేలు కట్ చేసేస్తామని పట్ట పగలే బెదిరిస్తున్నారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జగనేమో ఓ పక్క వారికి మంచి చేద్దామని చూస్తుంటే వీరేమో ఇలా ప్రవర్తిస్తూ జగన్ పరువు తీస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.