అడ్డంగా దొరికిన వైసీపీ,టీడీపీ 60-40 పాలిటిక్స్..ఇపుడు పార్ట్నర్స్ ఎవరు??

Sunday, December 15th, 2019, 09:31:40 PM IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలలో తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీలు చేస్తున్న చర్యలపై ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ దృష్టి సారించాల్సిందే.బయటకు ఈ రెండు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే లోలోపల మాత్రం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు 60-40 రాజకీయాలు చేసుకుంటూ ఒకరినొకరు బాగానే కాపాడుకుంటున్నారు.ఏపీ ప్రజల దృష్టిలో బద్ద శత్రువులుగా పరిగణించబడే వీరు ఓ విషయంలో అడ్డంగా చిక్కారు.ఈ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీలోకి ఆ పార్టీలో ఉన్నవారు ఈ పార్టీలోకి బాగానే చేరుతారు.

గతంలో టీడీపీలో ఉండి అవినీతి ఆరోపణలను ఎదుర్కున్న వారికే ఇప్పుడు వైసీపీ వాళ్ళే కీలక పదవులు కట్టబెడతారు.మధ్యలో జనాన్ని వెర్రి వాళ్ళను చేస్తారు.అది ఈ జనం ఎప్పటికీ పసిగట్టరు అది వేరే విషయం.జస్ట్ ఈ కొన్ని రోజుల నుంచి ఈ రెండు పార్టీల వ్యవహార శైలి గమనిస్తున్నట్టయితే ఆడవారిపై ఎవడన్నా చెయ్యి వేసినా అలాంటి ఆలోచనే వచ్చినా సరే ఎందుకో తెలుగు తమ్ముళ్లు మరియు వైసీపీ నేతలు కదిలిపోతున్నారు పాపం.గన్ కంటే జగన్ ముందు వస్తాడు జగనన్నే ఆడవాళ్లకు దేవుడు అన్న ఉన్నంత వరకు ఏపీలో మహిళలకు రక్ష అని వైసీపీ మహిళా నేతలు అంతా అసెంబ్లీలో ఒక రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చారు.

దానితో పాటు “చట్టం కేవలం కొంతమందికే చుట్టం.దాన్ని సామాన్యులకు వర్తింప చెయ్యం.” అని కూడా చెప్తే బాగుండేది.దిషా ఘటనతో దేశం అంతా అట్టుడికిపోయింది.దానితో జగన్ దిషా యాక్ట్ అని ఓ కొత్త చట్టం కూడా తీసుకొచ్చేసారు.ఓకే ఇది మంచిదే కాదనలేదు.కానీ 2017లో జరిగినటువంటి దారుణ ఘటన “సుగాలి ప్రీతీ” కేసు విషయం కోసం ఇటు వైసీపీ వాళ్ళు కానీ అటు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎందుకు అసెంబ్లీలో మాట్లాడ్డం లేదు.ఈ కేసు విషయంలో వీరి నైతికత ఎక్కడికి పోయింది?ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు?వీళ్ళు నిజంగానే టీడీపీను భూస్థాపితం చెయ్యాలనుకుంటే ఎందుకు టీడీపీ హయాంలోనే జరిగిన కేసును వెలికి తీసి దోషులను పట్టుకోలేకపోతున్నారు?

సరే దోషులు వైసీపీకి చెందిన వారు అనుకుందాం అందుకే వైసీపీ ఇప్పుడు చర్యలు తీసుకోలేదు.మరి అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఎందుకు చర్య తీసుకోలేదు?ఈ విషయంపై పవన్ మాట్లాడితే చంద్రబాబు పార్ట్నర్ అని అదే రొట్ట విమర్శలు చేస్తున్న వైసీపీ ఇప్పుడైనా సరే మాట్లాడాడు కదా దానికి వారి సమాధానం ఏది?పైగా అసెంబ్లీలో ఒక్క ముక్క కూడా టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ ఈ ఘటనపై మాట్లాడ్డం లేదు.అంటే టీడీపీకి వైసీపీకి లోపాయకారి ఒప్పందం ఉందా?వీరే నిజమైన పార్ట్నర్లా?ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అత్యాచార ఘటనలపై స్పందిస్తున్న లోకేష్ ఈ ఘటనపై ఎందుకు ఒక్క ట్వీట్ కూడా వెయ్యడం లేదు.సో దీనిని బట్టి ఎవరు ఎవరి పార్ట్నర్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది.