ఇన్సైడ్ టాక్ : జగన్ కు పిలుపు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా?

Tuesday, February 25th, 2020, 02:40:52 PM IST

అగ్ర రాజ్యాధినేత ట్రంప్ మొట్టమొదటి సారిగా భారత్ కు నిన్ననే వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ట్రంప్ రెండు రోజుల పర్యటనకు గాను దేశ వ్యాప్తంగా కొంతమంది ముఖ్యమంత్రులను విందు కోసం ఆహ్వానించారు.అలా మన దక్షిణాది నుంచి తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించి ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ ను మాత్రం మినహియించడమిప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

అయితే జగన్ ను ఎందుకు ఆహ్వానించలేదు అన్న అంశంపై పలువు సీనియర్ మోస్ట్ రాజకీయ విశ్లేషకులు కొన్ని కారణాలను వెల్లడించారు.అయితే అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే జగన్ కు ట్రంప్ తో సమావేశంకు పిలిపు ఎందుకు ఇవ్వలేదని పలువురు వైసీపీ నేతలు జగన్ కంటే ఎక్కువగా మదనపడిపోతున్నారట.

ముఖ్యంగా కెసిఆర్ కు పిలుపు రావడంతో మరింత ఆవేదన చెందుతున్నారట.ఎందుకంటే కేంద్రంలో మోడీ తీసుకునే ప్రతీ నిర్ణయానికి జగన్ జై కొట్టారు జస్ట్ గత వారంలోనే మోడీని కలిసి వచ్చారు అయినప్పటికీ జగన్ కు పిలుపు ఇవ్వకపోవడంతో కొందరు కలవరపడుతున్నారని టాక్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బయటకు వచ్చింది.