తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం

Sunday, May 2nd, 2021, 04:05:24 PM IST


తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నిక లో వైసీపీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ వైసీపీ తరపున బరిలో నిలిచిన గురుమూర్తి ఘన విజయం సాధించారు. గురుమూర్తి రెండు లక్షల ముప్పై ఒక్క వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో 2.28 లక్షల ఓట్ల మెజారిటీ తో వైసీపీ అభ్యర్ధి గెలుపొందగా, తాజాగా ఇప్పుడు ఆ రికార్డ్ ను సైతం బ్రేక్ చేయడం జరిగింది. అయితే తాజాగా సమాచారం మేరకు వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కి మొత్తం 5,37,152 ఓట్లు పొల్ అయినట్లు తెలుస్తోంది. ప్రతి పక్ష పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి కి 3,05,209 ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ కి 50 వేలకు పైగా ఓట్లు పోల్ అవ్వగా, కాంగ్రెస్ పార్టీ కి 8,477 ఓట్లు పోల్ అయ్యాయి.అయితే నోటా కి మాత్రం 13,401 మంది ఓట్లు వేసినట్లు తెలుస్తోంది.