ఇప్పుడు వాలంటీర్లతో ప్రచారం చేయించుకుంటున్నారా?

Wednesday, August 14th, 2019, 04:40:32 PM IST

తమ పార్టీ ఎప్పుడు ఏదొకలా ప్రజల మధ్యలో నానుతూ ఉండాలి వారి ఫోటోలు ఎప్పుడు కనిపిస్తేనే తప్ప ప్రజలకు వారి మొహాలు గుర్తుండవు అని మన రాజకీయ నాయకులు అనుకుంటారేమో కానీ వారి పార్టీ వ్యవస్థాపకుల ఫోటోలు వారి తండ్రుల ఫొటోలతో వారి ఫోటోలను కలిపి వారు ప్రవేశ పెట్టిన పథకాలకు పెట్టేసుకుంటూ ఉంటారు.సరే వారి పార్టీ అధికారంలో ఉంది అనుకుందాం మరి అలాంటప్పుడు వారి జేబుల్లోని డబ్బులు తీసి జనానికి ఈ పథకాలు అన్ని అమలు చెయ్యడం లేదుగా మళ్ళీ జనాల డబ్బులను వారికే ఇస్తూ వీరి ప్రచారాలు ఫ్రీగా చేసేసుకుంటున్నారు.

ఆ మధ్య దీనికి సంబంధించే అటు టీడీపీ మరియు ఇటు వైసీపీ అభిమానుల మధ్య రచ్చ నడించింది.గతంలో చంద్రబాబు ఏదైతే చేసారో ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు.ప్రజలకు ఇస్తున్న సన్న బియ్యం ప్యాకెట్ల మీద జగన్ మరియు దివంగత రాజశేఖర్ రెడ్డి ఫోటోలను ముద్రించేసరికి తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.అదంతా అయ్యిపోయింది కదా అంటే ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రవేశ పెట్టిన గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించిన గుర్తింపు కార్డుల తాలూకా ఫోటోలు బయటకు వచ్చాయి.

ఆఖరుకు దీనిపై కూడా జగన్ మరియు ఆయన తండ్రి ఫోటోలు దర్శనమిచ్చాయి.పొట్ట కూటి కోసం వైసీపీ పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఏదొకలా ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్న వారు ఇవి పెట్టుకొనే ఇంటింటికి తిరగాలి.లేకపోతే ఈ ఉద్యోగాలు ఎలాగో వైసీపీ కనుసైగల్లోనే వారి పార్టీలకు చెందిన వారికి మాత్రమే ఇస్తున్నారని వస్తున్న వార్తలు నిజమేనేమో అని చెప్పాలి.