వృద్దులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందా?

Wednesday, August 14th, 2019, 02:32:23 PM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ మాటలతో మేడలు కట్టేసారని ఇప్పుడు చెప్పక తప్పడం లేదు.తాను అధికారంలోకి రాక ముందు వచ్చాక చెప్పిన మాటల్లో చాలానే తేడాలు కనిపించాయి.అయితే ఈసారి జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిలో వృద్ధ ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారని చెప్పాలి.ఎందుకంటే జగన్ కు సామాన్య జనంతో పాటుగా వృద్ధుల్లో కూడా అపారమైన ఆదరణ ఉంది.దానికి తోడు ముందుగా జగన్ ఇస్తానన్న 3000 పింఛను అనే మాటకు మరింత ఆకర్షితులు అయ్యి ఈసారి అంతా ఫ్యానుకే గుద్దేసారు.

కానీ జగన్ గెలిచి వారికి పెన్షన్ వచ్చే సమయానికి అర్ధం అయ్యింది వారు మోసపోయారని,ఎందుకంటే జగన్ 3000 పింఛను ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కానీ దాన్ని కూడా దశల వారీగా ఇస్తానని ఎక్కడా చెప్పకుండా మ్యానిఫెస్టోలో పెట్టేసి ఇప్పుడు అలాగే ఇస్తామని చెప్తున్నారు.మాటలు వినే జనం మ్యానిఫెస్టో చదవలేరు కదా అందుకే ఓటు వేశారు.ఓకే ఇది బాగానే ఉంది.ఇప్పుడు వస్తున్న 2250 పింఛను అయినా సరిగ్గా నెల మొదట్లో సక్రమంగా అందుతుందా అంటే అది కూడా లేదు.

డబ్బుల్లేక కేవలం కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అందుతున్నాయి.మిగతా వారు ఆ డబ్బులు వచ్చే వరకు పడిగాపులు కాస్తూనే ఉన్నారు.దీనితో తెలుగుదేశం పార్టీ వారు అందుకొని చంద్రన్న అధికారంలో ఉన్నపుడు కేవలం మూడు రోజుల్లోనే ప్రతీ ఒక్కరికి పింఛను సొమ్ము అందేలా చూసేవారం అని కానీ జగన్ ప్రభుత్వం వృద్ధులకు తీరని అన్యాయం తమ సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోస్తున్నారు.