బయటపడుతున్న వైసీపీ ప్రభుత్వ డొల్లతనం..వృద్దుల డబ్బులు కూడానా?

Saturday, August 24th, 2019, 05:41:39 PM IST

జగన్ అధికారంలోకి వస్తే అది చేస్తాడు ఇది చేస్తాడు అని అంతా అనుకున్నా ఇప్పుడు అయితే మాత్రం అతను చెప్పే మాటలకు కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు కానీ ఒక్కటంటే ఒక్క శాతం కూడా పొంతన కనబడడం లేదు.తాను అధికారంలోకి వస్తే 45 ఏళ్లకు పింఛను ఇస్తానని చెప్పిన మాట వాస్తవం అలాగే 3000 పింఛను ఇస్తానని చెప్పిన మాట కూడా వాస్తవం అది నమ్మే వృద్ధ ఓటర్లు జగన్ కు భారీ స్థాయిలో ఓట్లు వేశారు.

కానీ 3000 పింఛను ఇస్తానని మాటల్లో చెప్పిన జగన్ దాని విడతల వారీగా అందజేస్తానని మాత్రం వారి మానిఫెస్టోలో పొందుపరిచారు.మాటలు విన్న జనం ఈ మానిఫెస్టోలో కూడా అదే ఉంటుందేమో అనుకోని జగన్ కు ఓట్లేసి గెలిపించారు.కానీ తీరా గెలిచాక మొదట్లో 250 పెంచి 2250 మాత్రమే పింఛను ఇస్తామని చెప్పగా ముందు షాకయ్యి సరేలే అని అదే తీసుకోడం మొదలు పెట్టారు.కానీ ఇప్పుడిప్పుడే ఇందులోని వైసీపీ ప్రభుత్వ డొల్లతనం అంతా బయటపడుతుంది.

ఇప్పటికే సకాలంలో వీరికి అందాల్సిన డబ్బులు ఇచ్చే క్రమంలో వీరు సగం ఫెయిల్ అయ్యారు.ఇదొక్కటే కాకుండా ఇచ్చే సగం డబ్బుల్లో కూడా దొంగ నోట్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి పింఛన్లు ఇస్తున్నారు.ఈ ఘటన కుక్కునూరు వేలేరుపాడు అనే గ్రామంలో వెలుగులోకి వచ్చింది.అక్కడ ఏకంగా ఇరవై ఆరున్నర లక్షల దొంగ నోట్లు వృద్దులకు పంచుతూ ఆరుగురు సిబ్బంది దొరికేసారు.మరి వీటి స్థానంలో రావాల్సిన పచ్చ నోట్లను ఎవరి ఖాతాల్లోకి తరలించేసారో ముఖ్యమంత్రి జగన్ కే తెలియాలి.