“రాజన్న రాజ్యం” అంటే ఇదేనా జగన్ గారు.?

Sunday, June 2nd, 2019, 10:51:24 PM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో తాను అధికారంలోకి వచ్చినట్టయితే దివంగత రాజశేఖర్ రెడ్డి పాలనగా పిలవబడే “రాజన్న రాజ్యం” తిరిగి మళ్ళీ తీసుకొస్తానని జగన్ ఒక పక్క హామీ ఇస్తుంటే మరో పక్క దానికి పూర్తి విరుద్ధంగా కొంత మంది వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో నడుచుకుంటున్న వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

జగన్ అధికారంలోకి వచ్చారన్న ఆనందంలో వైసీపీ అభిమానులు టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే సమయంలో ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా మరీ ముఖ్యంగా మహిళలపై కూడా దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేశారన్న వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇబ్బంది కలుగుతుందని వారిని అడ్డుకున్న వారిపై దాడులు చెయ్యడం మాత్రమే కాకుండా ఏం చెయ్యగలరు మీరు? అంటూ మా చేతులు పట్టుకొని లాగుతున్నారని వాపోయారు.

జగన్ వీళ్ళకి ఇలా మా చేతులు పట్టుకొని లాగమన్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.వచ్చింది మా రాజ్యం ఎవడు ఏం చేస్తాడు అంటూ వాగ్వాదానికి దిగారని వారు అంటున్నారు.దీనితో సోషల్ మీడియాలో రాజన్న రాజ్యం ఇలాగే తెస్తారా జగన్ గారు అంటూ కొంత మంది అంటుండగా మరికొంత మంది అయితే ఇక ముందు నుంచి మనం చాలా చూడాల్సి వస్తుందని అంటున్నారు.మొత్తానికి ఇలాంటి అత్యుత్సాహ కార్యకర్తల వల్ల జగన్ బలైపోతున్నారు.