రోజాకు వైఎస్ జ‌గ‌న్ ఝ‌ల‌కిస్తున్నట్టేనా?

Saturday, June 1st, 2019, 12:19:09 PM IST

వైఎస్ జ‌గ‌న్ క్యాబినెట్‌లో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం క‌ష్ట‌మేనా?. ఆమెకు పోటీగా హేమా హేమీలున్నారా? అంటే వైసీపీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. గ‌త తొమ్మిదేళ్లుగా జ‌గ‌న్ ను న‌మ్ముకుని అనేక క‌ష్ట‌న‌ష్టాల కోర్చి ఎదురు నిలిచిన వాళ్లు పార్టీలో చాలా మందే వున్నారు. అందులో ముఖ్యుడు అంబ‌టి రాంబాబు. వైఎస్ హ‌యాం నుంచి వైఎస్ కుటుంబానికి న‌మ్మిన ఫాలోవ‌ర్‌గా వుంటూ వ‌స్తున్నారు. ఇటీవల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాజీ స్పీక‌ర్‌, టీడీపీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రెడ్డిని దారుణంగా ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న ఈ ద‌ఫా మంత్రి స‌ద‌విని ఆశిస్తున్నారు. జ‌గ‌న్ ఆయ‌న‌ని ప‌క్క‌న పెట్టాల‌నుకోవ‌డం లేదు.

ఇక పార్టీలో సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు. ఈయ‌న‌ని మంత్రి వ‌ర్గం లోకి తీసుకోవాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. శాస‌న స‌భా ప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌ని ఎన్నుకునే సంద‌ర్భంలో జ‌గ‌న్‌తో పాటు వేదిక‌పై కూర్చున్న ఏకైక వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లే. ఆయ‌న‌కు అంతా ప్రాధాన్యం ఇచ్చిన జ‌గ‌న్ ఎమ్మెల్సీ కోటాలో ఆయ‌న‌ను మంత్రిని చేయాల‌నుకుంటున్నార‌ట‌. మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై గెలిస్తే మంత్ఇ ప‌ద‌వి ఇస్తాన‌ని ఎన్నిక‌ల వేళ ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి బ‌హిరంగంగానే జ‌గ‌న్ మాటిచ్చారు. కాబ‌ట్టి ఆయ‌న మంత్రి వ‌ర్గంలో వుంటారు. ఇక మైనార్టీ కోటా కింద గుంటూరు నేత మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా కూడా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంది. క‌డ‌ప జిల్లాకు చెందిన అంజ‌ర్ భాషా, గండికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, కురుముట్ల శ్రీ‌నివాసులు, చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి కూడా మంత్రి ప‌ద‌వి కోసం ఎదురుచూస్తున్నారు. వీరంద‌రిని దాటి రోజాకు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం కొంత క‌ష్ట‌మే అయినా ఆమె కేబినెట్ మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెసే వున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ని రోజా ఊరుకుంటుందా. మంద్రి ప‌ద‌వి కోసం ఫైట్ చేయ‌దూ అంటున్నారు న‌గ‌రి అభిమానులు.