బిగ్ బ్రేకింగ్ : సచివాలయం అభ్యర్థులకు భారీ షాక్..విసా రెడ్డి చెప్పిన భాగోతం నిజమేనా?

Wednesday, August 21st, 2019, 05:50:22 PM IST

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న ఎన్నో సంచలన నిర్ణయాల్లో ఉద్యోగాల భర్తీలు కూడా ఒకటని చెప్పాలి.ఎప్పటి నుంచో ఉన్న ఖాళీలు అంటిని తాను భర్తీ చేస్తానని గ్రామ సచివాలయంలోని అనేక పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసి నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని నింపిన వారయ్యారు.కానీ ఆ ఆనందం అంతా పైపనేనా అసలు విషయం అంతా లోపట జరగాల్సింది జరిగిపోతుందా అన్న అనుమానాలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి.

ఎందుకంటే జగన్ చెప్తున్న మాటలకు అలాగే పార్టీలో జరుగుతున్న పనులకు అస్సలు పొంతన అనేది కనబడడం లేదు.దీనికి ఉదాహరణగా గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల నియామకాలనే చెప్పుకోవచ్చు పారదర్శకతతో ఎంపిక పూర్తి చేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే నియామకాలు జరిగాయని నిజాయితీగా పార్టీ కోసం పని చేసిన తాము మోసపోయాం అని వైసీపీ అభిమానులే అనేక మంది చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్రాడ్యుయేట్స్ కు కూడా తగిలేలా ఉందని తెలుస్తుంది.మొత్తం లక్షకు పైగా ఉద్యోగాలకు వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చెయ్యగా దాదాపు ఈ ఉద్యోగాలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రన్ చేసే యూట్యూబ్ ఛానెల్స్ వారు తెలిపారు.అయితే ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు వచ్చే సెప్టెంబర్ 1 నుంచి మొదలు కాబోతుండగా వీటిని కూడా చాలా పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా సెలక్షన్ కమిటీ వారు తెలియజేసారు.

ఇక్కడే షాకిచ్చే విషయం ఏమిటంటే జరగబోయే పరీక్షలకు సంబంధించి పరీక్షా పత్రాలు కూడా సిద్దమయ్యి జిల్లా పంచాయితీలకు వచ్చేసాయని వార్తలొస్తున్నాయి.ఎలాగో ఈ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిచినవి కావడం అందులోను పరీక్షా పత్రాలు ముందుగానే వచ్చేయడంతో ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు భయపడుతున్నారు.పత్రాలు ముందుగానే వస్తే వారికి కావాల్సిన వారికి పత్రాలు లీకవ్వకుండా ఉంటాయని గ్యారంటీ ఏమిటని? ఖచ్చితంగా అవకతవకలు జరుగుతాయని అంటున్నారు.

ఈ వార్త తెలిసిన కొంతమంది అయితే ఇక ఈ ఉద్యోగాలు కూడా వాలంటీర్ ఉద్యోగాళ్లనే వైసీపీ వాళ్ళకే దక్కుతాయని ఇక పరీక్షలు రాసి కూడా వేస్ట్ అని నిరుత్సాహపడిపోతున్నారు.అయితే ఇక్కడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి.ఇటీవలే విజయసాయి రెడ్డి ఒక మీటింగులో మాట్లాడుతున్న మాటలను జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సందీప్ పంచకర్ల తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి సంచలనం రేపారు.

ఈ వీడియోలో ఎవరైతే వైసీపీ కోసం పని చేసారో వారికి వైసీపీ నుంచి జరగాల్సిన అన్ని పనులు జరుగుతున్నాయని వారికి అనుకూలంగా ఉండేటట్టు ఉద్యోగాల ప్రక్రియలు ఉండబోతున్నాయని అన్నారు.అంటే ఇది కూడా అందులో ఒక భాగమేనా అని ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు భయపడుతున్నారు.దీనిని బట్టి ఈ ఉద్యోగాల్లో కూడా ఏమన్నా అవకతవకలు జరగకుండా ఉండవు అని ఖచ్చితంగా చెప్పలేమనే చెప్పాలి.మరి ఇది ఎటు తీస్తుందో చూడాలి.